Parvathipuram: భద్రగిరి ఆసుపత్రికి విరాళాల వెల్లువ.. దాతల దాతృత్వం!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని భద్రగిరి ఆసుపత్రికి విశ్రాంత ఉపాధ్యాయులు జగన్నాథ్ రథో కుటుంబం వీల్‌చైర్లు, ఫ్యాన్లను విరాళంగా అందజేశారు.

V.SESHU	, KURUPAM
Published on: 1 May 2026 8:20 AM IST
Parvathipuram
X

Parvathipuram: భద్రగిరి ఆసుపత్రికి విరాళాల వెల్లువ.. దాతల దాతృత్వం!

పార్వతీపురం మన్యం జిల్లా: గుమ్మలక్ష్మీపురంలో ఉన్న భద్రగిరి ఆసుపత్రికి సమాజ సేవా భావంతో ముందుకు వచ్చిన విశ్రాంత ఉపాధ్యాయులు జగన్నాథ్ రథో కుటుంబ సభ్యులు ఆసుపత్రి అభివృద్ధికి తమ వంతు సహకారం అందించారు. జగన్నాథ్ రథో కుమార్తె అనిలాదాస్ మరియు తన భర్త లోకేష్, ఆసుపత్రి లో రోగుల సౌకర్యార్థం రెండు వీల్‌చైర్లు, నాలుగు సీలింగ్ ఫ్యాన్లు, రెండు వాల్ ఫ్యాన్లను విరాళంగా అందజేశారు.ఆసుపత్రికి వచ్చిన రోగులు, ముఖ్యంగా వృద్ధులు మరియు నడవలేని వారు వీల్‌చైర్ల ద్వారా సులభంగా చికిత్స పొందేందుకు వీలు కలగనుంది.

అలాగే వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ఫ్యాన్లు రోగులకు ఉపశమనం కలిగించనున్నాయి. ఈ విరాళాలు ఆసుపత్రి సౌకర్యాలను మెరుగుపరచడంలో కీలకంగా మారనున్నాయి.ఈ కార్యక్రమంలో గుడ్ల హరి మాస్టర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. అనిల్, వైద్యులు డా. సంతోష్, డా. షణ్ముఖి, డా. పావని మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. దాతృత్వానికి కృతజ్ఞతగా వైద్యులు జగన్నాథ్ రథోను సాలువాతో సత్కరించి అభినందించారు.స్థానిక ప్రజలు కూడా ఈ సేవను ప్రశంసిస్తూ, మరింత మంది ఇలాంటి కార్యక్రమాలకు ముందుకు రావాలని ఆకాంక్షించారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story