Gajapathinagaram: గజపతినగరంలో ‘జై కొట్టు’ పేరిట జనసేన మెగా బైక్ ర్యాలీ!

Gajapathinagaram: గజపతినగరంలో జనసేన పార్టీ 'జై కొట్టు' యువజన విభాగం ఆవిష్కరణ సందర్భంగా మెగా బైక్ ర్యాలీ నిర్వహించారు.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM
Published on: 2 Sept 2026 7:33 PM IST
Gajapathinagaram
X

Gajapathinagaram: గజపతినగరంలో ‘జై కొట్టు’ పేరిట జనసేన మెగా బైక్ ర్యాలీ!

గజపతినగరం: జనసేన పార్టీ యువతను మరింతగా పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసే దిశగా 'జై కొట్టు' పేరుతో యువజన విభాగాన్ని ఏర్పాటు చేసింది. గజపతినగరం లో జరిగిన కార్యక్రమంలో గజపతినగరంలో నియోజకవర్గ సమన్వయకర్త మర్రాపు సురేశ్, మాజీ మంత్రి పడాల అరుణ ఆధ్వర్యంలో బుధవారం మెగా బైక్ ర్యాలీ నిర్వహించారు.

ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో స్క్రీన్ ల ద్వారా, 'జై కొట్టు' పేరుతో జనసేన పార్టీ 'యువజన విభాగం' జనసేన నాయకులు,, కార్యకర్తలు లైవ్ ను వీక్షించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వీడియో సందేశం ద్వారా యువతకు శుభాకాంక్షలు తెలిపారు. యువతను సంఘటితం చేసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా భాగస్వామ్యం చేయడమే ఈ విభాగం లక్ష్యంగా పేర్కొన్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి సంబరరాలు జరుపుకున్నారు.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

G.BHASKARA RAO, GAJAPATINAGARAM