Parvathipuram: జియ్యమ్మవలసలో పోలీసుల వజ్రప్రహార్ ఆపరేషన్ భారీ తనిఖీలు!

Parvathipuram: మన్యం జిల్లా జియ్యమ్మవలస ఎస్సీ కాలనీలో పోలీసులు ఆపరేషన్ వజ్రప్రహార్‌లో భాగంగా విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి తనిఖీలు చేపట్టారు.

V.SESHU	, KURUPAM
Published on: 4 July 2026 5:33 PM IST
Parvathipuram
X

Parvathipuram: జియ్యమ్మవలసలో పోలీసుల వజ్రప్రహార్ ఆపరేషన్ భారీ తనిఖీలు!

పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస పోలీస్ స్టేషన్ పరిధిలోని జియ్యమ్మవలస గ్రామ ఎస్సీ కాలనీలో శనివారం ఆపరేషన్ “వజ్రప్రహార్”లో భాగంగా పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, ఐపీఎస్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీల ఉద్దేశ్యం మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా మరియు సంబంధిత నేరాలను అరికట్టడమే అని పోలీసులు తెలిపారు.

చినమేరంగి సీఐ తిరుపతి రావు ఆధ్వర్యంలో జియ్యమ్మవలస ఎస్సై ప్రశాంత్ మరియు సర్కిల్ సిబ్బంది గుర్తించిన హాట్‌స్పాట్ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మాదకద్రవ్యాల వినియోగం జరుగుతున్నట్లు అనుమానిస్తున్న ప్రాంతాలు, అద్దె ఇళ్లు, ఖాళీ భవనాలు మరియు ఇతర అనుమానాస్పద ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. అలాగే అనుమానాస్పద ద్విచక్ర వాహనాల పత్రాలను పరిశీలించి తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది మరియు స్థానిక ప్రజలతో కలిసి “ఆపరేషన్ వజ్రప్రహార్ ప్రతిజ్ఞ” నిర్వహించారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని, సమాజాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story