Parvathipuram: పార్వతీపురం తోటపల్లి వద్ద జలవిద్యుత్ కేంద్రం పరిశీలన
Parvathipuram: తోటపల్లి బ్యారేజీ వద్ద జలవిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి. ప్రాజెక్టు రూపకల్పనపై అధికారులతో చర్చలు.
Parvathipuram: పార్వతీపురం తోటపల్లి వద్ద జలవిద్యుత్ కేంద్రం పరిశీలన
పార్వతీపురం: సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజి ఎడమ ప్రధాన కాలువపై M/s. May Encons Pvt. Ltd. సంస్థ ప్రతిపాదించిన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం స్థల సేకరణకు సంబంధించి బుధవారం సంయుక్త కలెక్టర్ ఆర్. వైశాలి క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా సంయుక్త కలెక్టర్ మొదట తోటపల్లి బ్యారేజి ఎడమ ప్రధాన కాలువ తూము వద్ద ప్రతిపాదిత స్థలాన్ని సంయుక్తంగా పరిశీలించారు.
జలవిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణ, సాంకేతిక అంశాలు మరియు పరిసర ప్రాంతాల పరిస్థితులపై అధికారులతో చర్చించారు. గతంలో నాగావళి నదిపై నాగూరు గ్రామం వద్ద ప్రైవేటు యాజమాన్యంలో నిర్మించబడి, ప్రస్తుతం విజయవంతంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న జలవిద్యుత్ కేంద్రాన్ని సంయుక్త కలెక్టర్ సందర్శించారు.
అక్కడ ఏర్పాటు చేసిన అధునాతన యంత్ర సామగ్రి, వాటి పనితీరును మరియు విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను ఆమె నిశితంగా పరిశీలించారు. తోటపల్లి వద్ద ప్రతిపాదిత ప్రాజెక్టును మరింత సమర్థవంతంగా రూపకల్పన చేసేందుకు ఈ క్షేత్రస్థాయి పరిశీలన ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు.ఈ పర్యటనలో రెవిన్యూ డివిజనల్ అధికారి కె.మాధురి, జలవనరుల శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది మరియు ప్రైవేటు సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




