Parvathipuram: రీ-సర్వే పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు!

Parvathipuram: కలెక్టర్ ఆర్. వైశాలి ఐఏఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్లతో రీ-సర్వే మరియు పెండింగ్ మ్యుటేషన్ల పరిష్కారంపై సమీక్షా సమావేశం జరిగింది.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 20 July 2026 10:02 PM IST
Parvathipuram
X

Parvathipuram: రీ-సర్వే పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు!

పార్వతీపురం: జాయింట్ కలెక్టర్ శ్రీమతి ఆర్. వైశాలి, ఐఏఎస్ గారి అధ్యక్షతన, పాలకొండ ఉప కలెక్టర్, పార్వతీపురం ఆర్‌డీఓ మరియు జిల్లాలోని తహసీల్దార్లతో రీ-సర్వే పనులు, రెవెన్యూ పరిపాలనకు సంబంధించిన వివిధ అంశాలపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామాల వారీగా రీ-సర్వే పనుల పురోగతి, వెక్టరైజేషన్, ఎఫ్‌ఎంబీ (FMB) రికార్డుల నవీకరణ, భూ సరిహద్దుల నిర్ధారణ, పెండింగ్ సర్వే కేసుల పరిష్కారం, మ్యుటేషన్ దరఖాస్తుల వేగవంతమైన పరిష్కారం, రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, ఈ-ఆఫీస్ ద్వారా ఫైళ్ల సకాలంలో పరిష్కారం, ప్రజల నుండి అందుతున్న రెవెన్యూ ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలపై విస్తృతంగా సమీక్షించారు.

జాయింట్ కలెక్టర్ గారు రీ-సర్వే పనులను నాణ్యతతో, పారదర్శకంగా మరియు నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తూ, భూ వివాదాలు మరియు అభ్యంతరాలను నిబంధనల ప్రకారం సత్వరమే పరిష్కరించాలని సూచించారు.అలాగే ప్రతి మండలంలో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ అంశాలను ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలని, మ్యుటేషన్, సర్వే, భూ రికార్డుల నవీకరణ, ప్రజా వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం లేకుండా పని చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని మండలాల్లో పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో పాలకొండ ఉప కలెక్టర్, పార్వతీపురం ఆర్‌డీఓ, జిల్లాలోని తహసీల్దార్లు మరియు సంబంధిత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story