Bobbili: జర్నలిస్ట్ కేవీఆర్‌కు 14 రోజుల రిమాండ్ సబ్ జైలుకు తరలింపు
Bobbili: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు. హైదరాబాద్‌లో జర్నలిస్ట్ కేవీఆర్ అరెస్ట్.. బొబ్బిలి కోర్టు రిమాండ్.
Bobbili: జర్నలిస్ట్ కేవీఆర్‌కు 14 రోజుల రిమాండ్ సబ్ జైలుకు తరలింపు
బొబ్బిలి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఓ జర్నలిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని బొబ్బిలి తరలించారు.
విజయనగరం జిల్లా బాడంగి మాజీ సర్పంచి కండి రమేష్ ఇచ్చిన ఫిర్యాదుతో తెలంగాణకు చెందిన జర్నలిస్టు కె. వెంకటరామిరెడ్డి అలియాస్ కేవీఆర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సరూర్‌నగర్‌లో మంగళవారం రాత్రి బాడంగి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
భారత రాజ్యాంగం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై అసభ్యకరంగా, అనుచితంగా వ్యాఖ్యలు చేశారంటూ ఏప్రిల్ 10న రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినా కేవీఆర్ స్పందించలేదనీ,దీంతో బొబ్బిలి రూరల్ సీఐ శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ వెళ్లి అరెస్ట్ చేసింది. బుధవారం అతడిని బొబ్బిలి పోలీస్ స్టేషన్‌కు తరలించి, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు.
గురువారం కోర్టుకు పోలీసులు హాజరు పరిచారు.జర్నలిస్టు కోశిక వెంకట్రామిరెడ్డి అలియాస్ కేవీ రెడ్డికి బొబ్బిలి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆయనను బొబ్బిలి సబ్ జైలుకు తరలించారు.




