Parvathipuram: పూసపాటిరేగ ఘటనపై మండిపడ్డ జర్నలిస్టులు సాలూరులో ర్యాలీ!
Parvathipuram: పూసపాటిరేగలో విలేకరిపై దాడికి నిరసనగా సాలూరులో జర్నలిస్టుల రాస్తారోకో. రక్షణ చట్టం తేవాలని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్.
Parvathipuram: పూసపాటిరేగ ఘటనపై మండిపడ్డ జర్నలిస్టులు సాలూరులో ర్యాలీ!
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పూసపాటిరేగలో విశాలాంధ్ర పత్రిక విలేకరిపై జరిగిన దాడిని ఖండిస్తూ జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్ స్తంభించింది.
అనంతరం జాతీయ రహదారి నుంచి గాంధీ విగ్రహం వరకు జర్నలిస్టులు ర్యాలీగా వెళ్లారు గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు విలేకరులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని జర్నలిస్టు సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
విధి నిర్వహణలో ఉన్న విలేకరులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు జర్నలిస్టులపై దాడులు పునరావృతం కాకుండా ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని నాయకులు పేర్కొన్నారు విలేకరుల హక్కులు, భద్రతకు ప్రభుత్వం చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరారు ఈ నిరసన కార్యక్రమంలో జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




