Vizianagaram: విజయనగరం టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం!
Vizianagaram: విజయనగరం టీడీపీ జిల్లా కార్యాలయంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం.
Vizianagaram: విజయనగరం టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం!
విజయనగరం: విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం శనివారం నూతన ఉత్సాహంతో అట్టహాసంగా మారింది. విజయనగరం పార్లమెంటరీ పార్టీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం మరియు 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) అవగాహన సదస్సు జిల్లా స్థాయి సమావేశం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి వర్యులు, చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారు నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
తొలుత పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమావేశానికి విచ్చేసిన నాయకులను, కార్యకర్తలను ఎమ్మెల్యే కళావెంకట రావు ఆత్మీయంగా పలకరిస్తూ ఉత్తేజపరిచారు.
ప్రజల ఆశయాలే మన లక్ష్యం – ఇంటింటికీ కూటమి విజయాలు
సమావేశంలో శ్రీ కిమిడి కళావెంకటరావు గారు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో, ప్రజాసేవ భావంతో పనిచేయాలి. రానున్న పదిరోజులలో పార్టీ శ్రేణులన్నీ ప్రతి ఇంటికీ వెళ్ళి, గత రెండేళ్ల కాలంలో మన కూటమి ప్రభుత్వం సాధించిన చారిత్రాత్మక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి" అని పిలుపునిచ్చారు. రహదారులు, తాగునీరు, విద్యా, వైద్యం, రైతు సంక్షేమం, మహిళా సాధికారత వంటి ప్రతి రంగంలోనూ ప్రభుత్వం విశేష కృషి చేసిందని, ఈ విజయాలను ప్రజలకు వివరించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు.
త్రిమూర్తుల నేతృత్వంలో సరికొత్త ఆంధ్రప్రదేశ్
ఎన్డీయే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అపర చాణక్య నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి అండదండలతో, యువ నేత, ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సరికొత్త, వినూత్న ఆలోచనల సాయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేడు అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కళావెంకట రావు కొనియాడారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పునరుద్ధరణతో పాటు, సింగపూర్ తరహా మౌలిక వసతులు, బహుళజాతి పెట్టుబడుల ప్రవాహం, పారిశ్రామిక ప్రగతి, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి వంటి చర్యలతో కూటమి ప్రభుత్వం సరికొత్త శకానికి నాంది పలికింది. ముఖ్యంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పారిశ్రామిక, ఐటీ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఓటరు జాబితా ప్రక్షాళన (SIR)ను విజయవంతం చేద్దాం
ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకమైన ఓటరు జాబితా ప్రాధాన్యతను వివరిస్తూ.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అనేది అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించే అత్యంత కీలకమైన ప్రక్రియ. ఒకే ప్రాంతంలో నివసించే వారికే ఓటు ఉండేలా చూస్తూ, బూత్ స్థాయిలో దొంగ ఓట్లను ఏరిపారేయడానికి ఇది ఉపయోగపడుతుంది. నిజాయితీగా ఉండే పార్టీలకు ఈ ప్రక్రియ చూసి భయం లేదు, తప్పుడు ఓట్లతో బతికేవారికే భయం. నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములై ఈ 'సర్' (SIR) కార్యక్రమాన్ని విజయనగరం జిల్లాలో 100% విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ ఘనమైన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, విజయనగరం ఎంపీ శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు శ్రీ కిమిడి నాగార్జున గారు, విజయనగరం శాసనసభ్యులు అదితి గజపతి రాజు గారు, రాజాం శాసన సభ్యులు కొండ్రు మురళీ గారు, నెల్లిమర్ల ఇంచార్జ్ బంగార్రాజు గారు, పార్లమెంటరీ పార్టీ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు..




