Chipurupalli: పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు!
Chipurupalli: విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న చీపురుపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు.
Chipurupalli: పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు!
చీపురుపల్లి: విజయనగరం జిల్లా ప్రజల ఆరాధ్య దైవం, ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారిని చీపురుపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.
అనంతరం ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో శ్రీ కళా వెంకట్రావు గారు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి శేషవస్త్రం మరియు తీర్థప్రసాదాలను అందజేశారు.
దర్శనానంతరం ఆయన మాట్లాడుతూ.. చీపురుపల్లి నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, అమ్మవారి దయాకటాక్షాలు అందరిపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.




