Komarada: రీ-సర్వే, ఈ-కేవైసీ పనులను పరిశీలించిన జేసీ

Komarada: కొమరాడ మండలం దంగభద్ర గ్రామంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి పర్యటించారు.

Narsimha Reddy
Published on: 21 May 2026 8:32 PM IST
Komarada
X

Komarada: రీ-సర్వే, ఈ-కేవైసీ పనులను పరిశీలించిన జేసీ

కొమరాడ: మండలంలోని దంగభద్ర గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనులు మరియు ఈ-కేవైసీ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో సాగుతున్న సర్వే పనుల పురోగతి, భూ వివరాల నమోదు, సాంకేతిక విధానాల అమలు తదితర అంశాలను ఆయన నిశితంగా పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. భూ రికార్డుల ఖచ్చితత్వం కోసం రీ-సర్వే పనులను అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సర్వే ప్రక్రియలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, సిబ్బంది అంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ-కేవైసీ ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ

గ్రామంలో కొనసాగుతున్న ఈ-కేవైసీ ప్రక్రియను పరిశీలించిన జాయింట్ కలెక్టర్, అర్హులైన ప్రతి లబ్ధిదారుని వివరాలను సక్రమంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. నమోదులో ఎటువంటి తప్పిదాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రక్రియను నిర్ణీత గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

రైతులతో ముఖాముఖి

అనంతరం జాయింట్ కలెక్టర్ గ్రామ రైతులతో నేరుగా మాట్లాడారు. వారి భూ సంబంధిత సమస్యలు, పంటల పరిస్థితులు, మరియు ప్రభుత్వ పథకాల అమలు తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలి. రైతులకు అవసరమైన సహాయం, ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా చూడాలను అధికారులను ఆదేశించారు.

Narsimha Reddy

Narsimha Reddy

Next Story