Kurupam: ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురు చూస్తున్న పేద కుటుంబం

Kurupam: కురుపాం మండలం శివన్నపేటకు చెందిన 10 ఏళ్ల చిన్నారి కౌశిక్ గుండె శస్త్రచికిత్స అనంతరం మందులు, వైద్య ఖర్చుల కోసం దాతల సహాయం కోరుతున్నాడు.

V.SESHU	, KURUPAM
Published on: 6 Oct 2026 2:43 PM IST
Kurupam
X

Kurupam: ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురు చూస్తున్న పేద కుటుంబం

కురుపాం: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం శివన్నపేట గ్రామానికి చెందిన 10 ఏళ్ల చిన్నారి కొత్తపట్నం కౌశిక్ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో చికిత్స కొనసాగించలేని పరిస్థితిలో ఉన్నాడు. కౌశిక్ తండ్రి రాము రోజువారీ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుటుంబానికి స్థిరమైన ఆదాయం లేకపోవడంతో వైద్య ఖర్చులు భారంగా మారాయి.

గత నెలలో కౌశిక్‌కు గుండె సంబంధిత సమస్య కారణంగా విజయవాడలోని హెల్ప్ ఆసుపత్రిలో ఉచితంగా ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయినప్పటికీ, వైద్యుల సూచన మేరకు ప్రతి నెల విజయవాడకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు నిరంతరం మందులు వాడాల్సి ఉంది.

అయితే ప్రయాణ ఖర్చులు, మందుల కొనుగోలు వ్యయాలను భరించే స్థోమత లేక కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ సమస్యను జిల్లా కలెక్టర్ నిర్వహించే పీజీఆర్ఎస్‌లో వినతిపత్రం ద్వారా తెలియజేయగా, ఇలాంటి కేసులకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించే పథకం ప్రస్తుతం లేదని, అవసరమైన మందుల కోసం ప్రభుత్వ వైద్యశాఖను సంప్రదించాలని సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సమీపంలోని మాదలింగి పీహెచ్‌సీని సంప్రదించగా, అవసరమైన మందులు అక్కడ అందుబాటులో లేవని, అవసరమైతే పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేస్తామని వైద్య సిబ్బంది తెలిపినట్లు వారు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో చిన్నారి కౌశిక్ ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన మందులు, వైద్య పరీక్షల ఖర్చుల కోసం దాతలు, సేవా సంస్థలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకువచ్చారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM