Kurupam: కురుపాంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి నివాళులర్పించిన బీజేపీ

Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు. చిత్రపటానికి నివాళులర్పించిన బీజేపీ నేత బోటు అనిల్ కుమార్.

V.SESHU	, KURUPAM
Published on: 7 July 2026 10:33 AM IST
Kurupam
X

Kurupam: కురుపాంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి నివాళులర్పించిన బీజేపీ

కురుపాం: పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం మండల కేంద్రంలో సోమవారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకుడు బోటు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బోటు అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఒకే దేశం, ఒకే జెండా, ఒకే ప్రధాని అనే జాతీయ సంకల్పానికి ప్రాణం పోసి, అఖండ భారతం కోసం అవిశ్రాంతంగా పోరాడిన మహనీయుడు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. దేశ సమైక్యత, జాతీయత కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.

కురుపాం, శివన్నపేట గ్రామాల్లోని వివిధ బూత్ కేంద్రాల్లో కూడా శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను నిర్వహించినట్లు అనిల్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాలంకి, ఓబీసీ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ ప్రదీప్, ఎంసీ డైరెక్టర్ ఎన్.పురం శీను, బరాటం కిరణ్ కుమార్, అద్దేపల్లి నిర్మల, కొండగొర్రె గోపాల్, దొనక మణి భూషణ్ రావు, కొత్తకోట సతీష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story