Kurupam: బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం: కురుపాంలో సీపీఐ గోడపత్రిక!

Kurupam: కురుపాంలో సీపీఐ ప్రజాపోరాట కరపత్రం, గోడపత్రిక ఆవిష్కరణ. ఆగస్టు 6 నుంచి పాదయాత్రలు, సెప్టెంబర్ 1న 'చలో ఢిల్లీ'కి సీపీఐ పిలుపు.

V.SESHU	, KURUPAM
Published on: 30 July 2026 1:09 PM IST
Kurupam
X

Kurupam: బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం: కురుపాంలో సీపీఐ గోడపత్రిక!

కురుపాం:

బిజెపి నిరంకుశ ప్రజా వ్యతిరేక పరిపాలన ను ప్రతీఒక్కరూ ఎండకట్టాలని సిపిఐ మన్యం జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు కోరారు. గురువారం కురుపాంలో సిపిఐ ప్రజాపోరాట కార్యచరణ కు సంబంధించిన గోడ పత్రిక ను నాయకులు తో కలిసి విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యవసర ధరలు పెరుగుదల ను తక్షణమే నియంత్రణ చర్యలు తీసుకోవాలని ,పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే దిశగా చట్టం రూపొందించాలని ,ఈవీఎంలు తో కాకుండా బ్యాలెట్ విధానం లో పాత పద్దతిలో ఎన్నికల నిర్వహించాలని ,మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని ,జిఓ నంబర్3 ,1/70 చట్టాలు పునరుద్ధరణ చేయాలని ,నిరుద్యోగ యువతకు ఉద్యోగ ,ఉఫాది అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పై సమస్యలు పై ఆగస్టు6-15వరకూ గ్రామాల్లో సిపిఐ పాదయాత్ర లు ,ఆగస్టు17-28 ప్రజాసంఘాలు ప్రధాన ఆందోళనలు ,సెప్టెంబర్1 చలో డిల్లీ కార్యక్రమం నిర్వహణకు సంబంధించిన గోడ పత్రిక విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పువ్వుల ప్రసాద్ ,జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి రౌతు దుర్గా ప్రసాద్ ,కార్యవర్గ సభ్యులు గోపినాయుడు ,వికలాంగ సమితి ప్రతినిధి ,బిడ్డిక భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story