Kurupam: దస్తావేజు లేఖరుల ‘పెన్‌డౌన్’ సమ్మె.. రిజిస్ట్రేషన్లపై భారం?

Kurupam: మన్యం జిల్లా కురుపాంలో జీవో 396కు వ్యతిరేకంగా దస్తావేజు లేఖరులు, సహాయకులు పెన్‌డౌన్ సమ్మె చేపట్టారు. ఈ జీవో వల్ల ప్రజలపై రూ. 5,200 అదనపు భారం పడుతుందని

V.SESHU	, KURUPAM
Published on: 6 July 2026 5:02 PM IST
Kurupam
X

Kurupam: దస్తావేజు లేఖరుల ‘పెన్‌డౌన్’ సమ్మె.. రిజిస్ట్రేషన్లపై భారం?

కురుపాం: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని దస్తావేజు లేఖరులు, సహాయకులు, డీటీపీ నిర్వాహకులు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో ఎంఎస్ నెం.396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కురుపాం సబ్ రిజిస్ట్రార్ (ఎస్‌ఆర్‌ఓ)కు వినతిపత్రాన్ని సమర్పించారు.

దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలోని ఫ్రంట్ ఆఫీస్ సేవలను ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నిర్వహించే విధంగా ప్రభుత్వం జీవో 396ను తీసుకువచ్చిందని తెలిపారు. ఈ విధానం అమల్లోకి వస్తే ప్రతి రిజిస్ట్రేషన్‌కు కక్షిదారుల నుంచి సుమారు రూ.5,200 వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

అలాగే ఈ నిర్ణయం వల్ల రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలు అధిక వ్యయప్రయాసలకు గురికావడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది దస్తావేజు లేఖరులు, సహాయకులు, డీటీపీ నిర్వాహకుల జీవనోపాధి దెబ్బతింటుందని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఈ జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వారు కోరారు.

రాష్ట్ర మరియు జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘాల పిలుపు మేరకు జీవో 396ను వ్యతిరేకిస్తూ జూలై 6, 7, 8 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా పెన్‌డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కురుపాం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని దస్తావేజు లేఖరులు, సహాయకులు, డీటీపీ నిర్వాహకులు ఐక్యంగా పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.

జీవో 396ను తక్షణమే రద్దు చేసి, రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story