Kurupam: వర్షాకాలం వస్తోంది.. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Kurupam: వర్షాకాలం నేపథ్యంలో కురుపాం మండలం మొండెంఖల్ పిహెచ్‌సిలో డిపిఎమ్ఓ డాక్టర్ రవి సమీక్ష. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశం.

V.SESHU	, KURUPAM
Published on: 4 Jun 2026 2:29 PM IST
Kurupam
X

Kurupam: వర్షాకాలం వస్తోంది.. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Kurupam: రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని, గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ (డిపిఎమ్ఓ) డాక్టర్ ఎం.ఎం. రవి కుమార్ రెడ్డి వైద్య సిబ్బందిని ఆదేశించారు. గురువారం నాడు కురుపాం మండలంలోని మొండెంఖల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) ఆయన సందర్శించి, సిబ్బందితో కలిసి ప్రత్యేక రివ్యూ మీటింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా డిపిఎమ్ఓ డాక్టర్ రవి కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులతో పాటు సికిల్ సెల్ ఎనీమియాపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 'నాటు మందుకి నమస్కారం', 'లార్వా వేట' వంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించాలని, దోమల ఉత్పత్తిని అరికట్టేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వైద్య సిబ్బంది క్షేత్రస్థాయి పర్యటనలు చేసినప్పుడు గ్రామాల్లోని ప్రజలందరూ వారికి పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన కోరారు.​ఈ సమీక్షా కార్యక్రమంలో మొండెంఖల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సిహెచ్. వెంకటేష్, సూపర్వైజర్ సిబ్బంది నాగేశ్వరరావు, విజయ్ కుమారి, సుగుణ, మరియు వైద్య సిబ్బంది జె. తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story