Kurupam: కురుపాంలో ఆరు ఆవులు స్వాధీనం.. అక్రమ రవాణాదారుడిపై కేసు!

Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో అక్రమంగా తరలిస్తున్న 6 ఆవులను పోలీసులు స్వాధీనం చేసుకుని గరివిడి గోశాలకు తరలించారు.

V.SESHU	, KURUPAM
Published on: 18 Aug 2026 8:59 PM IST
Kurupam
X

Kurupam: కురుపాంలో ఆరు ఆవులు స్వాధీనం.. అక్రమ రవాణాదారుడిపై కేసు!

కురుపాం, ఆగస్టు 18: పశువులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో అప్రమత్తమైన కురుపాం పోలీసులు దాడులు నిర్వహించి ఆరు ఆవులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని సంరక్షణ నిమిత్తం విజయనగరం జిల్లా గరివిడిలోని శ్రీ శ్రీ దుర్గామల్లేశ్వరి గో సంరక్షణ సమస్త గోశాలకు తరలించి అప్పగించారు.

ఈ ఘటనకు సంబంధించి గుమ్మలక్ష్మీపురం మండలం కేదారపురం గ్రామానికి చెందిన బిడ్డక రంజిత్ (27)ను నిందితుడిగా గుర్తించిన పోలీసులు, సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ సందర్భంగా కురుపాం పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ పి. నారాయణరావు మాట్లాడుతూ, పశువులపై క్రూరత్వం ప్రదర్శించడం, అక్రమంగా తరలించడం లేదా చట్టవిరుద్ధంగా రవాణా చేయడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశువుల అక్రమ రవాణా లేదా వాటిపై క్రూరత్వానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story