Sivannapeta: శివ్వన్నపేటలో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ
Sivannapeta: కురుపాం నియోజకవర్గం శివ్వన్నపేటలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి పంపిణీ చేశారు.
Sivannapeta: శివ్వన్నపేటలో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ
Sivannapeta: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించడం ద్వారా వారి భూములకు పూర్తి భద్రత చేకూరుతుందని ప్రభుత్వ విప్, కురుపాం శాసనసభ్యులు తోయక జగదీశ్వరి పేర్కొన్నారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, భూ సమస్యల పరిష్కారంలో భాగంగా అర్హులైన ప్రతి రైతుకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ద్వారా భూ యజమానులకు పూర్తి హక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా, క్షేత్రస్థాయిలోనే పాసు పుస్తకాలు పంపిణీ చేయడం సంతోషదాయకమన్నారు. పాసు పుస్తకాల్లో ఏవైనా సాంకేతిక లోపాలు ఉంటే వెంటనే సంబంధిత తహశీల్దార్ దృష్టికి తీసుకువచ్చి సరిచేసుకోవాలని రైతులకు సూచించారు.
శుక్రవారం కురుపాం మండలం శివ్వన్నపేట గ్రామంలో జరిగిన ఒక నియోజకవర్గం - నాలుగు గ్రామాల కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి గారితో కలిసి పలు అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో ఆమె పాల్గొన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో లబ్ధిదారులైన రైతులకు జిల్లా కలెక్టర్ తో కలిసి ఆమె నూతన పట్టాదారు పాసు పుస్తకాలను (భూ హక్కు పత్రాలు) పంపిణీ చేశారు.
గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు తడి, పొడి చెత్తను శాస్త్రీయంగా సేకరించేందుకు వీలుగా గ్రామ పంచాయతీ సిబ్బందికి చెత్త సేకరణ ట్రై-సైకిళ్లను ఎమ్మెల్యే, కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ మరియు స్వచ్ఛ భారత్ లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు ఈ సందర్బంగా కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, ఎస్ సొసైటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు పాల్గొన్నారు.




