Kurupam: గిరిజన రైతులకు అండగా ప్రభుత్వం.. సబ్సిడీతో పరికరాల పంపిణీ!

Kurupam: పార్వతీపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో కురుపాంలో గిరిజన రైతులకు 75 శాతం సబ్సిడీపై వ్యవసాయ ఉపకరణాలు, విత్తనాల పంపిణీ.

V.SESHU	, KURUPAM
Published on: 31 May 2026 7:16 AM IST
Kurupam
X

Kurupam: గిరిజన రైతులకు అండగా ప్రభుత్వం.. సబ్సిడీతో పరికరాల పంపిణీ!

Kurupam: గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధి, వ్యవసాయోత్పత్తి పెంపుదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పేర్కొన్నారు.సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటిడిఎ), పార్వతీపురం ఆధ్వర్యంలో ఎస్‌సిఏ టు టీఎస్‌ఎస్ 2025-26 పథకం కింద శనివారం క్యాంపు కార్యాలయంలో గిరిజన రైతులకు వ్యవసాయ ఉపకరణాలు, విత్తనాలను ఆమె పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఐటిడిఎ ద్వారా 75 శాతం సబ్సిడీపై పేద గిరిజన రైతులకు టార్పాలిన్లు, ఆయిల్ ఇంజిన్లు, నాణ్యమైన వ్యవసాయ విత్తనాలను అందజేశారు.

ఈ ఉపకరణాలు, విత్తనాలు వ్యవసాయ దిగుబడులు పెంచడంతో పాటు రైతుల ఆదాయ వృద్ధికి దోహదపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి అర్హ లబ్ధిదారునికి చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. గిరిజన రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయ రంగంలో మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఐదు మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, ఐటిడిఎ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story