Kurupam: కురుపాంలో నాటుసారా పట్టివేత 70 లీటర్లు స్వాధీనం, ఒకరి అరెస్ట్!

Kurupam: కురుపాం మండలం కాకితాడ జంక్షన్ వద్ద మోటార్ సైకిల్‌పై 70 లీటర్ల నాటుసారా తరలిస్తున్న వ్యక్తిని నీలకంఠపురం పోలీసులు అరెస్ట్ చేశారు.

V.SESHU	, KURUPAM
Published on: 7 July 2026 10:49 AM IST
Kurupam
X

Kurupam: కురుపాంలో నాటుసారా పట్టివేత 70 లీటర్లు స్వాధీనం, ఒకరి అరెస్ట్!

కురుపాం: అక్రమంగా నాటుసారా తరలిస్తున్న వ్యక్తిని నీలకంఠపురం పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. నీలకంఠపురం ఎస్సై నీలకంఠారావు తెలిపిన వివరాల ప్రకారం కాకితాడ మెయిన్ రోడ్ జంక్షన్ వద్ద పోలీసు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా మొండెంఖళ్లు గ్రామానికి చెందిన గంటా శ్యామ్ సుందర్ మోటార్ సైకిల్‌పై 70 లీటర్ల నాటుసారాను తన గ్రామానికి అమ్మకానికి తీసుకెళ్తూ కనిపించాడు.

అనుమానం రావడంతో వాహనాన్ని తనిఖీ చేయగా 70 లీటర్ల నాటుసారా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే నాటుసారాతో పాటు రవాణాకు ఉపయోగించిన మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకుని గంటా శ్యామ్ సుందర్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.

నిందితుడిపై కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న నాటుసారా మరియు వాహనాన్ని దర్యాప్తు నిమిత్తం సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం నిందితుడిని కురుపాం జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై నీలకంఠారావు వెల్లడించారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story