Kurupam: కురుపాం పోలీసుల మెరుపు దాడి.. సారా ముఠా గుట్టురట్టు

Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో అక్రమ నాటు సారా రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

V.SESHU	, KURUPAM
Published on: 22 Jun 2026 4:22 PM IST
Kurupam
X

Kurupam: కురుపాం పోలీసుల మెరుపు దాడి.. సారా ముఠా గుట్టురట్టు

Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నాటు సారా రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు జూన్ 21న మూలిగూడ జంక్షన్ వద్ద పోలీసులు నిఘా నిర్వహించి మీసాల శ్రీకాంత్‌ను పట్టుకున్నారు.

నిందితుడి వద్ద నుంచి 40 లీటర్ల నాటు సారా, సారా రవాణాకు ఉపయోగించిన ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నేరంలో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు నిందితులు వెలగాడ చిన్న రాయుడు, మీసాల దిలీప్‌లను గుర్తించి అరెస్టు చేశారు.అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను సోమవారం గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది.

అక్రమ మద్యం తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలపై జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని, ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని కురుపాం ఎస్సై నారాయణరావు హెచ్చరించారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story