Kurupam: వైభవంగా కురుపాం శ్రీ పైడిమారమ్మ ఆలయ ప్రతిష్టా వేడుకలు: భక్తి పారవశ్యంలో మన్యం జిల్లా!

Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో శ్రీ పైడిమారమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మే 1న ప్రతిష్టానంతరం మహా అన్నప్రసాదం, నేడు రోషన్ లాల్ ఆర్కెస్ట్రా కార్యక్రమాల వివరాలు.

V.SESHU	, KURUPAM
Published on: 30 April 2026 9:39 AM IST
Kurupam
X

Kurupam: వైభవంగా కురుపాం శ్రీ పైడిమారమ్మ ఆలయ ప్రతిష్టా వేడుకలు: భక్తి పారవశ్యంలో మన్యం జిల్లా!

కురుపాం (పార్వతీపురం మన్యం): పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గ్రామ దేవత శ్రీ పైడిమారమ్మ నూతన ఆలయ -శిలా విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఏప్రిల్ 28,29,30 మరియు మే 01 తేదీలు లో అసంఖ్యాక దేవాలయ ప్రతిష్టాపకులు ,వేదపండితులు శ్రీ యస్వీ ఎల్ ఎన్ శర్మ యాజీ వీరఘట్టాం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.ప్రతిష్ట మహోత్సవం లో భాగంగా

ఉదయం: 06:00 దీక్షాదంపతులు పూజాసామాగ్రితో హాజరగుట

06:30 ఉదయకాలపూజ

07:00రత్న /ధాతు / గర్త / లోహ / మూర్తి / యంత్రన్యాసములు

08:00 నుండి ధాన్యాధివాసము- చిత్రాన్ననివేదనము

పగలు 09:00 నుండి సాయంత్రం 05:00 వరకు :

గ్రామస్తులు / పరిసరప్రాంతప్రజలు / సమస్త జనావళి అలంకరించబడిన కొత్తవెదురు బుట్టతో ధాన్యం తెచ్చి జగన్మాతకు సమర్పించుకొనుట

సాయంత్రం 05:00 లకు పూజా దీక్షాసామాగ్రితో దంపతులు హాజరగుట

05:30 నుండి సప్తసత్యంబా (చండీ) వైభవహోమము- సాయంకాలార్చనము

రాత్రి 07:30 సుమారుగా పుష్పాదివాసము (శయ్యాదివాసము)

రాత్రి 07:35 గుడశర్కరాణ్ణ నివేదనము

రాత్రి 08:00 నుండి (సుమారుగా) గ్రామస్తులు / పరిశరప్రాంత ప్రజలు/

సప్తజనావాళితో వివిధరకాల సువాసనాభరితపుష్పము పూలదండలు తెచ్చి జగన్మాతకు సమర్పించుట

రాత్రి 09:00 నుండి వేకువ 05:00 వరకు నామ సంకీర్తన (భజన)

నాల్గవ రోజు 01/మే/2026 శుక్రవారం

ఉదయం: 06:30 కు పూజాసామాగ్రితో దీక్షా దంపతులు హాజరగుట

07:00 నుండి దివాకాలార్చనము- దధ్యోదన నివేదనము

07:15 క్షీరాదివాస అభిమంత్రణ- హవన ద్రవ్యము సమర్పనము

08:00 (సుమారుగా) గ్రామస్తులు / పరిశరప్రాంతప్రజలు /

సమస్తజనావళీకొత్త మట్టిపిడతను అలంకరించి ఆవు పాలతో నింపి, తీసుకునివచ్చి

జగన్మాతను అభిషేకించుట

అనంతరం అమ్మవారి దర్శనం

శీ పైడిమారమ్మ ఆలయ ప్రతిష్టాకార్యక్రమంలో భాగంగా ఇవాళ రాత్రి రోషన్ లాల్ ఆర్కెస్ట్రా (విశాఖ)ను యువరాజా శ్రీ వైరిచర్ల వీరేష్ చంద్ర దేవ్ గారు ఏర్పాటు చేశారు... అందరూ కుటుంబ సభ్యులు ,బంధువులు తో హాజరై ఆనందంగా గడపాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మే 01 ప్రతిష్టానంతర దర్శనం ,మహా అన్న ప్రసాదం అధికసంఖ్యలో నిర్వహించ నున్నామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story