Vizianagaram: బొబ్బిలిలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా!
Vizianagaram: విజయనగరం జిల్లా బొబ్బిలిలో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా ఈసీఐ విశ్వనీయతను దెబ్బతీస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌నుతొలగించాలని డిమాండ్
Vizianagaram: బొబ్బిలిలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా!
Vizianagaram: ఎన్నికల సంఘం స్వాతంత్రతను, విశ్వనీయతను దెబ్బతీసిన భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని బొబ్బిలి ఎన్టీఆర్ బొమ్మ సెంటర్లో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి శంకర్రావు సిపిఐ జిల్లా నాయకులు మునకాల శ్రీను సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు వి రామ్మూర్తి మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ ప్రక్రియను
నిలిపివేయాలని ఓటర్ల జాబితా నుంచి అన్యాయంగా తొలగింపుకు గురైన వారందరికీ ఓటు హక్కును పునరుద్ధరించాలని కోరారు ఈసీఐ స్వతంత్రత ప్రజాస్వామ్యత పనితీరును పునర్దించాలని ఎన్నికల కమిషనర్ల నియమికానికి ఉన్న ప్రస్తుత వ్యవస్థను రద్దు చేయాలని ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన సుప్రీంకోర్టు ప్రతిపాదించిన ఎంపిక కమిటీ ఆధారిత యంత్రాంగాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టడంతో పాటు ఏదోరకంగా అధికారంలోకి రావడం అధికారంలోకి వచ్చిన తరువాత దానిని శాశ్వతం చేసుకునేందుకు మరింతగా అడ్డుగోలు వ్యవహారాలకు పాల్పడటం ఆర్ఎస్ఎస్, బిజెపి వ్యూహం దీనిలో భాగంగానే వ్యవస్థల విశ్వనీయతను దెబ్బతీయడం తన అనుచరులతో నింపివేయడం మరింతగా మతోన్మాద విషం చిమ్మడం వంటి చర్యలకు పాల్పడుతుంది. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన భారత ఎన్నికల సంఘం 2014 తర్వాత వరస వివాదాల్లో కూరికుపోయింది.
తాజాగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పై వచ్చిన ఆరోపణలో భారత ఎన్నికల సంఘం విశ్వనీయతనే ప్రశ్నార్ధకంగా మార్చాయి. 30 రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాలు లో 13 కోట్లు కు పైగా ఓట్లు తొలగించారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధమని అన్నారు. జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందని అన్నారు.
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేస్తుంది దేశద్రోహానికి పాల్పడుతుంది ఈ విధానాలకు వ్యతిరేకంగా పార్టీలు పౌర సంఘాలు ప్రజలు అవినీతిపరుడైన జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి గోపాలు, సిపిఐ నాయకులు కె .అప్పన్న జగదీష్, ఫెలోషిప్ అధ్యక్షులు ఫ్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు.




