Parvathipuram: కార్గిల్ విజయ్ దినోత్సవం సందర్భంగా మాజీ సైనికులకు న్యాయ అవగాహన సదస్సు
Parvathipuram: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా పార్వతీపురంలో మాజీ సైనికులకు న్యాయ అవగాహన సదస్సు.
Parvathipuram: కార్గిల్ విజయ్ దినోత్సవం సందర్భంగా మాజీ సైనికులకు న్యాయ అవగాహన సదస్సు
పార్వతీపురం: జూలై నెల 26న జరగబోయే కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఈరోజు రెండవ అదనపు జిల్లా జడ్జి కోర్టు సమావేశ మందిరంలో మాజీ సైనిక్ ఉద్యోగులకు అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం మాధురి మాట్లాడుతూ 1999 కార్గిల్ యుద్ధంలో భారత్ సైన్యం సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ వారి యొక్క త్యాగాలను బలిదానాలను దేశం స్మరించుకోవడం ముఖ్యమని తెలియజేశారు.
వారు మాట్లాడుతూ మాజీ సైనికులకు ఉద్దేశించి నాల్సా వారు ప్రవేశపెట్టిన వీర్ పరివార్ సహాయత పథకం గూర్చి తెలియజేశారు. అదేవిధంగా ఉచిత న్యాయ సహాయం గూర్చి మరియు న్యాయ సహాయం కోసం ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1 5 1 0 0 ను వినియోగించుకుని న్యాయ సేవలను పొందవచ్చని తెలియజేశారు.
మాజీ సైనికులకు న్యాయ సహాయము అలాగే మరి ఏ ఇతర సహాయం చేయడానికి అయినా మండల న్యాయ సేవ అధికార సంస్థ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని న్యాయ సేవ అధికార సంస్థ సేవలను వినియోగించుకోవలసిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎడిషనల్ జ్యూడిషియల్ మే స్టేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ శ్రీమతి జె సౌమ్య జోష్ ఫైన్ పార్వతీపురం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి వెంకటరావు సీనియర్ న్యాయవాది టీ జోగారావు మరియు మాజీ సైనిక్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు కే నారాయణ రావు పాల్గొన్నారు.




