Parvathipuram: హరిఓం ట్రేడర్స్ స్క్రాప్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం మొట్ట వెంకటాపురం గ్రామంలోని హరిఓం ట్రేడర్స్ స్క్రాప్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

KAILASH SAHU, PALAKONDA
Published on: 20 May 2026 12:57 PM IST
Parvathipuram
X

Parvathipuram: హరిఓం ట్రేడర్స్ స్క్రాప్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం!

Manyam: మన్యం జిల్లా వీరఘట్టం మండలం మొట్ట వెంకటాపురం గ్రామం హరిఓం ట్రేడర్స్ స్క్రాప్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.స్క్రాప్ గోడౌన్ కావడంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్టు ఓనర్ కనకల కోటేశ్వరరావు తెలిపారు. పాలకొండ అగ్నిమాపక ఎస్సై సర్వేశ్వరరావు తన బృందంతో పాటు వెళ్లి మంటలను అదుపుచేసారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. భారీగా ఆస్థి నష్టం జరిగిందని నష్టాన్ని అంచనా వేస్తున్నామని ఫైర్ ఎస్సై సర్వేశ్వరరావు తెలిపారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story