Jiyyammavalasa: జి.ఎం.వలసలో వర్ష బీభత్సం: పంట నష్టంపై అధికారుల పరిశీలన

Jiyyammavalasa: పార్వతీపురం మన్యం జిల్లా జి.ఎం.వలస మండలంలో ఈదురుగాలులు, వర్షాల వల్ల దెబ్బతిన్న అరటి తోటలు, కూలిన ఇళ్ల గోడలను మండల ప్రత్యేకాధికారి పరిశీలించారు.

V.SESHU	, KURUPAM
Published on: 24 Sept 2026 5:38 PM IST
Jiyyammavalasa
X

Jiyyammavalasa: జి.ఎం.వలసలో వర్ష బీభత్సం: పంట నష్టంపై అధికారుల పరిశీలన

జియమ్మవలస: పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్డి గారి ఆదేశాల మేరకు మండల పరిషత్ ప్రత్యేక అధికారి బి వి నాగభూషణ రావు జి.ఎం.వలస మండలంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.

ఈ పర్యటనలో ఈదురుగాలులు మరియు వర్షాల కారణంగా తీవ్ర పంట నష్టం మరియు ఆస్తి నష్టం జరిగినట్లు గుర్తించారు. మండలంలోని చింతలబెలగాంలో 15 ఎకరాలు, తుమ్మలవలసలో 10 ఎకరాలు, సింగనాపురంలో 11 ఎకరాలు, అలాగే రాజయ్యపేటలో 9 ఎకరాల చొప్పున అరటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఇక ఇళ్ల నష్ట విషయానికి వస్తే, బాసింగి గ్రామంలో 3 ఇళ్ల గోడలు, తాళాడ పంచాయతీ చంద్రశేఖరరాజపురంలో ఒక ఇల్లు మరియు ఒక గోడ, పి.టి.మండలో ఒక గోడ, ఎమ్మెల్లువలసలో మరొక ఇల్లు గోడలు కూలిపోయాయి.

అయితే ఈ ఘటనల్లో ఎటువంటి ప్రాణనష్టం నమోదు కాలేదని, కేవలం గోడలు కూలడం వంటి ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని స్పష్టం చేశారు.

​అలాగే గడిసింగపురం, దంగభద్ర, జి.ఎం.వలస ప్రాంతాల్లోని మూడు వాగుల్లో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో ముందస్తు జాగ్రత్త చర్యగా త్రాళ్లు కట్టి రాకపోకలను అడ్డుకున్నారని, భద్రత కోసం అక్కడ వి.ఆర్.ఓ (VRO) మరియు కానిస్టేబుల్‌ను అందుబాటులో ఉంచామని తెలిపారు.

గడిసింగపురం వద్ద ఉన్న రామునాయుడు చెరువు, అంకవరం వద్ద ఉన్న కంసాలి బంధ చెరువులు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని తహసీల్దార్ మరియు పోలీసు శాఖ ఆధ్వర్యంలో వి.ఆర్.ఓలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

మధ్యాహ్నం నాటికి వాగుల్లో నీటి ఉధృతి కొంత మేర తగ్గిందని, అరటి తోటల పంట నష్ట పరిహార అంచనాపై వ్యవసాయ శాఖ అధికారుల వివరాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని వివరించారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM