Vizianagaram: "ప్రతి నెలా మేం తోడుంటాం" గుర్లలో సేవా సంఘం గొప్ప నిర్ణయం!

Vizianagaram: విజయనగరం జిల్లా గుర్ల మండలం పోలయవలసలో అంధుని కుటుంబానికి మాతృభూమి సేవా సంఘం చేయూత.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 27 April 2026 11:12 AM IST
Vizianagaram
X

Vizianagaram: "ప్రతి నెలా మేం తోడుంటాం" గుర్లలో సేవా సంఘం గొప్ప నిర్ణయం!

విజయనగరం జిల్లా: గుర్ల మండలం పోలయవలస గ్రామానికి చెందిన అంధుడు సిరిశెట్టి అచ్యుతరావు కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని సంస్థ ప్రతినిధులు బెవర కుర్మారావు మాతృభూమి సేవా సంఘం దృష్టికి తీసుకురావడంతో, సంఘం సభ్యులు స్పందించారు. సంఘం తరఫున సభ్యులు నాగులాపల్లి నారాయణరావు ఆ కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఇకపై ప్రతి నెలా వారికి సరుకులు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ, "ఆకలితో ఉన్నవారికి అమ్మలా ఆదరించే సంస్థ మన మాతృభూమి సేవా సంఘం. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే మా లక్ష్యం. సేవా కార్యక్రమాల్లో మా సంఘం ఎల్లప్పుడూ ముందుంటుంది" అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, గ్రామంలో యువత, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story