Parvathipuram: పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరం!

Parvathipuram: పాలకొండ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సూపరింటెండెంట్ డా. కడియం చిరంజీవి వెల్లడి. అన్ని రకాల స్పెషలిటీ సేవలు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 29 Sept 2026 9:55 AM IST
Parvathipuram
X

Parvathipuram: పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరం!

Parvathipuram: విజ్ఞప్తి. పాలకొండ మరియు చుట్టుపక్కల మండలాల ప్రజలకు విజ్ఞప్తి. ఉదయం 9 గంటల నుండి పాలకొండ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి లో మెగా వైద్య శిభిరం నిర్వహించబడును.

ఈ వైద్య శిభిరం లో రక్తపోటు, మధుమేహం, నోటి కాన్సర్, రొమ్ము కాన్సర్, గర్భసంచి కాన్సర్, టీబీ, రక్తహీనత, సీకోలె సెల్ అనేమియా, గర్భిణీ తనిఖీలు, పిల్లలకు వ్యాధినిరోధక టీకాలు, రక్తదాన శిభిరం, ఆరోగ్యానికి తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించడం,

గర్భిణీ స్త్రీ తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించడం,మరియు ఆయుర్వేద వైద్యం లో సలహాలు సూచనలు చికిత్స. ఈ వైద్య శిబిరం లో అన్ని రకముల స్పెషలిటీ సేవలు లభ్యమగును.

ఈ వైద్య శిబిరం లో ప్రత్యేకంగా గుండె జబ్బుల వైద్య నిపుణులు, కాన్సర్ వ్యాధి నిపుణులు, ఆయుర్వేద వైద్య నిపుణులు, హోమియో వైద్య నిపుణులు రానున్నారు ఈ వైద్య శిభిరం ని ప్రజలు అందరూ వినియోగించుకోవాలని మా మనవి.

సర్వే జనా సుఖినోభవంతు. డా. కడియం చిరంజీవి. మెడికల్ సూపరింటెండెంట్ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి. పాలకొండపార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA