Merakamudidam: పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కళా వెంకటరావు
Merakamudidam: మెరకముడిదాం మండలం నరసయ్యపేటలో రూ.32 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ప్రారంభించారు.
Merakamudidam: పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కళా వెంకటరావు
విజయనగరం జిల్లా, మెరకముడిదాం: మెరకముడిదాం మండలం నరసయ్యపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మాజీ మంత్రి, చీపురుపల్లి ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళా వెంకటరావు ఆదివారం ఘనంగా ప్రారంభించారు.
32 లక్షల రూపాయల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళా వెంకటరావు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి పంచాయతీ కార్యాలయాలు కీలకంగా పనిచేస్తాయన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, వేగంగా అందేలా గ్రామ పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
నూతన పంచాయతీ భవనం అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజలకు పరిపాలనా సేవలు మరింత చేరువ కానున్నాయని పేర్కొన్నారు. గ్రామంలో అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి తన వంతు కృషి నిరంతరం కొనసాగుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




