Gummalakshmipuram: భద్రగిరిలో ఆశ్రమ పాఠశాల అదనపు భవనం ప్రారంభం

Gummalakshmipuram: గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరిలో రూ. 1.75 కోట్ల వ్యయంతో నిర్మించిన గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల అదనపు వసతి గదుల భవనాన్ని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి మరియు కలెక్టర్ ప్రారంభించారు.

V.SESHU	, KURUPAM
Published on: 9 Aug 2026 10:20 AM IST
Gummalakshmipuram
X

Gummalakshmipuram: భద్రగిరిలో ఆశ్రమ పాఠశాల అదనపు భవనం ప్రారంభం

రూ. 175.00 లక్షలతో ఆశ్రమ పాఠశాల అదనపు వసతి గదుల భవనం ప్రారంభం

గుమ్మలక్ష్మీపురం, ఆగస్టు 8 : సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ, పార్వతీపురం పరిధిలోని గిరిజన విద్యాసంస్థల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు తోయక జగదీశ్వరి పేర్కొన్నారు.గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి గ్రామంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు ఆర్టికల్ 275(1) నిధులు రూ. 175.00 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన అదనపు వసతి గదుల భవనాన్ని శనివారం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డితో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడూతూ, గిరిజన విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆహ్లాదకరమైన, సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యనందించేందుకే ఈ అదనపు వసతి గదులను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, ఐటీడీఏ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story