Pedaborabandha: సాలూరు మండలం పెదబోరబంధలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటన

Pedaborabandha: మంత్రి గుమ్మడి సంధ్యారాణి రైతులకు రాజముద్ర పాస్ పుస్తకాలు పంపిణీ చేసి, గత వైసీపి ప్రభుత్వ సర్పంచుల నిధుల మళ్లింపుపై విమర్శలు గుప్పించారు.

B VENKATESH, SALURU
Published on: 25 July 2026 8:24 PM IST
Pedaborabandha
X

Pedaborabandha: సాలూరు మండలం పెదబోరబంధలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటన

పెడబొరబంధ: సాలూరు మండలం పెదబోరబంధ గ్రామంలో రైతులకి పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి. అనంతరం మంత్రి బహిరంగ సభ నుద్దేశించి మాట్లాడుతూ, పాస్ పుస్తకాల్లో తప్పులు సరిదిద్ది రీ సర్వే ద్వారా రాజముద్ర తో రైతులకి పాస్ బుక్ ఇవ్వడం జరిగింది.

సాలూరు నియోజకవర్గం లో ప్రతి పంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీలు జడ్పిటిసిలు అన్ని మనమే గెలవాలి, కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తేనే మీ గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది, ఐదు సంవత్సరాల్లో వైసీపీలో ఒక సర్పంచ్ కైనా పైసా ఇచ్చారా. బొచ్చు పట్టుకొని అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సర్పంచులకి పాత బకాయిలన్నీ చంద్రబాబు ఇచ్చారు. మీకు నిజంగా మనస్సాక్షి ఉంటే మీరంతా కూటమి ప్రభుత్వాన్ని బలపరచాలి అన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి.

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU

Next Story