Bhogapuram: ద్యార్థినులతో కలిసి ధింసా స్టెప్పులేసిన మంత్రి గుమ్మిడి!

Bhogapuram: ప్రధాని మోదీ సమక్షంలో 13 వేల మంది బాలికలు ధింసా నృత్యం చేయనుండగా, పి.కొనవలస విద్యార్థినులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అభినందించారు.

B VENKATESH, SALURU
Published on: 29 July 2026 6:55 PM IST
Bhogapuram
X

Bhogapuram: ద్యార్థినులతో కలిసి ధింసా స్టెప్పులేసిన మంత్రి గుమ్మిడి!

భోగాపురం: భోగాపురంలో జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో నిర్వహించనున్న ధింసా నృత్యంలో పాల్గొనేందుకు పాచిపెంట మండలం పి.కొనవలస గిరిజన బాలికల ఉన్నత పాఠశాల నుంచి బయలుదేరుతున్న 230 మంది గిరిజన విద్యార్థినులను రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ & శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ఆప్యాయంగా కలిసి అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా విద్యార్థినులతో మంత్రి ఆత్మీయంగా మమేకమై, వారితో కలిసి సంప్రదాయ ధింసా నృత్యం చేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు అనంతరం బాలికలకు ప్రయాణంలో జాగ్రత్తలు పాటించాలని, క్రమశిక్షణతో వ్యవహరించాలని, రాష్ట్ర గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని సూచించారు.

మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని గిరిజన బాలికల పాఠశాలల నుంచి మొత్తం 13,000 మంది గిరిజన బాలికలు ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని ధింసా నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారని తెలిపారు. గిరిజనుల గొప్ప సంస్కృతి, కళారూపాలను దేశ ప్రధాని సమక్షంలో ప్రదర్శించే అరుదైన అవకాశం లభించడం ప్రతి విద్యార్థినికి గర్వకారణమని పేర్కొన్నారు.

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం రాష్ట్ర అభివృద్ధికి చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని, ఈ వేడుకలో గిరిజన బాలికలు తమ ప్రతిభను చాటుకుని రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆకాంక్షించారు.

B VENKATESH, SALURU

B VENKATESH, SALURU

Next Story