vizianagaram: గరుడబిల్లిలో "ఇంటింటికీ తెలుగుదేశం"పాల్గొన్న మంత్రి !

vizianagaram: గరుడబిల్లిలో రూ.1.20 కోట్ల సీసీ రోడ్డును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించి, "ఇంటింటికీ తెలుగుదేశం" ప్రచారంలో పాల్గొన్నారు.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM
Published on: 7 Aug 2026 5:11 PM IST
vizianagaram
X

vizianagaram: గరుడబిల్లిలో "ఇంటింటికీ తెలుగుదేశం"పాల్గొన్న మంత్రి !

vizianagaram: బొండపల్లి మండలం గరుడబిల్లిలో రూ 1కోటి 20 లక్షలతో సీసీ రోడ్డు ప్రారంభం అనంతరం. ఇంటింటికీ తెలుగుదేశం"లో పాల్గొన్న మంత్రి కొండపల్లి విజయనగరం జిల్లా, బొండపల్లి మండలం, గరుడబిల్లి గ్రామంలో రూ.1 కోటి 20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు.

రోడ్డు ప్రారంభోత్సవం అనంతరం గ్రామంలో నిర్వహించిన “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత రెండేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. గరుడబిల్లి గ్రామానికి మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం" అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

G.BHASKARA RAO, GAJAPATINAGARAM

Next Story