Vizianagaram: ఎట్టకేలకు తీరనున్న గిరిజనుల కష్టాలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
Vizianagaram: విజయనగరం జిల్లా మర్రివలసలో చంపావతి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. గిరిజన గ్రామాల కష్టాలు తీరనున్నాయి.
Vizianagaram: ఎట్టకేలకు తీరనున్న గిరిజనుల కష్టాలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం జిల్లా: గజపతినగరం మండలం మర్రివలస గ్రామానికి ముందు ఉన్న చంపావతి నది పై కూటమి పాలనలో 6.50 లక్షల తో బ్రిడ్జి మరియు రహదారి నిర్మాణం కు శంకుస్థాపన చేయడంతో ఎట్టకేలకు మర్రివలస పరిసర గ్రామాల్లో 8 గిరిజన గ్రామాల గిరిజనుల కష్టాలు తీరినట్టైయ్యింది.
ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చంపావతి నది లో నడుచుకుంటూ ప్రజా సమస్యలను తెలుసుకొనేందుకు మర్రివలస గ్రామంలోకి అడుగుపెట్టారు.
ఎన్నో ఏళ్లుగా వర్షాకాలంలో చంపావతి నది పై రాక పోకలకు తాము పడే బాదలు, ఇబ్బందులు నేటి తో తీరనున్నాయని ఆయా గిరిజన గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన పంచాయతీ భవనాన్ని ప్రారంబించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.
Next Story




