Vizianagaram: గజపతినగరంలో ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' భారీ బైక్ ర్యాలీ!
Vizianagaram: గజపతినగరంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా భారీ 'హర్ ఘర్ తిరంగా' బైక్ ర్యాలీ. పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి.
Vizianagaram: గజపతినగరంలో ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' భారీ బైక్ ర్యాలీ!
Vizianagaram: విజయనగరం జిల్లా గజపతినగరంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వారోత్సవాలు, లో గజపతినగరం కొత్త బ్రిడ్జి వద్దనుండి - కరెంట్ ఆఫీస్ వరకు “హర్ ఘర్ తిరంగా” బైక్ ర్యాలీలో రాష్ట్ర మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం పార్లమెంటు సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, తిరంగ జెండా ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తికి ప్రతీక అని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమైక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని విజయవంతం చేశారు.
Next Story




