Vizianagaram: యోగాంధ్ర వేడుకలు.. 1000 మందితో కలిసి యోగాసనాలు వేసిన మంత్రి!

Vizianagaram: విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నెలివాడలో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 14 Jun 2026 10:34 AM IST
Vizianagaram
X

Vizianagaram: యోగాంధ్ర వేడుకలు.. 1000 మందితో కలిసి యోగాసనాలు వేసిన మంత్రి!

విజ‌య‌న‌గ‌రం: 12 వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా థిమేటిక్ యోగా కార్యక్రమం కింద భాగంగా బొండపల్లి మండలం నెలివాడ గ్రామంలోని అంకన్న చెరువు వద్ద యోగాంధ్ర కార్యక్రమం ప్రారంభం. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి, యోగ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు, పాల్గొన్న జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి గారు.

కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేసిన మంత్రి, కలెక్టర్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు. చెరువు గట్టు పై సుమారు అర కిలోమీటర్ మేర ఆసీనులై యోగాసనాలు వేసిన ఉపాధి వేతనదారులు. 1000 మంది ఉపాధి హామీ కూలీలతో కలిసి యోగాంధ్ర కార్యక్రమం నిర్వ‌హ‌ణ‌.

భారతదేశంలో మన పూర్వీకులు మనకు అందించిన ఒక గొప్ప వరం యోగ అన్న మంత్రి. కరోనా సమయంలో యోగా, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం కోరుకున్నాన‌న్న మంత్రి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో యోగా కార్యక్రమం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. వందలాది మంది యోగాలో పాల్గొనడం సంతోషంగా ఉంది ఇదే ఒరవడి ప్రతీ నిత్యం.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story