మన్యం జిల్లా ప్రజలకు మంత్రి సంధ్యారాణి కీలక సూచనలు.. ఐదు రోజుల పాటు తీవ్ర వడగాల్పుల ముప్పు.

Minister Sandhyarani: పార్వతీపురం మన్యం జిల్లాలో రానున్న ఐదు రోజులు తీవ్ర వడగాల్పులు వీస్తాయని మంత్రి సంధ్యారాణి హెచ్చరించారు. 15 మండలాల్లో 54 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

V.SESHU	, KURUPAM
Published on: 30 April 2026 10:22 AM IST
మన్యం జిల్లా ప్రజలకు మంత్రి సంధ్యారాణి కీలక సూచనలు.. ఐదు రోజుల పాటు తీవ్ర వడగాల్పుల ముప్పు.
X

మన్యం జిల్లా ప్రజలకు మంత్రి సంధ్యారాణి కీలక సూచనలు.. ఐదు రోజుల పాటు తీవ్ర వడగాల్పుల ముప్పు.

పార్వతీపురం మన్యం: పార్వతీపురం మన్యం జిల్లాలో వడగాలుల ముప్పు అధికంగా ఉంటాయని అధికారులు మరియు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి మంత్రి సంధ్యారాణి తెలియజేసారు.15 మండలాల్లో ఎక్కువగా ఉన్న ముప్పు (డేంజర్’ అలర్ట్)అన్నారు. రాష్ట్ర రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) తాజా నివేదిక ప్రకారం మన్యంలో ఐదు రోజుల పాటు తీవ్రమైన ఎండలు మరియు వడగాల్పులు,ప్రమాదకర స్థాయిలో 41°C నుండి 54°C మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయని, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి ఆమె సూచించారు. ముఖ్యంగా కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సీతానగరం, సాలూరు, పాచిపెంట, మక్కువ, సీతంపేట, భామిని, కొమరాడ, వీరఘట్టం, బలిజిపేట, జియ్యమ్మవలస, పార్వతీపురం, గరుగుబిల్లి,పాలకొండ మండలాలు లో ప్రభావితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో ఎటువంటి వర్ష సూచన లేనందున ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు రావొద్దు అని ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి ఆమె మన్యం జిల్లా ప్రజలకు సూచించారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story