Parvathipuram: ముందస్తుగా పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర!
Parvathipuram: శని, ఆదివారాలు సెలవులు కావడంతో వృద్ధులకు ముందస్తుగా పెన్షన్లు పంపిణీ చేశారు.
Parvathipuram: ముందస్తుగా పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర!
Parvathipuram: శని ఆదివారాలు సెలవులు రావడంతో వృద్ధులు, వికలాంగులకు ఇబ్బంది లేకుండా ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తెలిపారు. గురువారం ఉదయం పార్వతీపురం పట్టణంలోని 24, 25 వార్డుల పరిధిలో వృద్ధులు, వితంతులు, వికలాంగులకు ఆయన పెన్షన్లు పంపిణీ చేశారు.అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే విజయ్ చంద్ర అందరికీ పెన్షన్ మొత్తం అందజేసి ఆప్యాయతను ప్రదర్శించారు.
అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ రేపు ఎల్లుండి శని ఆదివారాలు రావడంతో ముందుగానే పెన్షన్లు పంపించేసి వృద్ధులు వికలాంగుల సంక్షేమం పట్ల చంద్రబాబుకు ఉన్న నిబద్ధతను మరియు అభిమానాన్ని చాటుకున్నారని తెలిపారు.
ఇక పార్వతీపురం మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. వచ్చే రెండేళ్లలో పార్వతీపురం పట్టణాన్ని సర్వ సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే విజయ్ చంద్ర హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.




