Parvathipuram: ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం..ఎమ్మెల్యే!
Parvathipuram: పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారం.
Parvathipuram: ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం..ఎమ్మెల్యే!
Parvathipuram: ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, సమస్య విన్నవించిన వెంటనే పరిష్కరించడమే మా లక్ష్యం అని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజాదరార్లో ఆయన ప్రజల సమస్యలను వినతుల రూపంలో స్వీకరించారు.
ఈ మేరకు పింఛన్లు, గిరిజన ప్రాంతాలుకు నీటి సమస్య, గృహాలు, భూ సమస్యలతోపాటు పలు రకాల వినతులను ప్రజల ద్వారా ఆయన స్వీకరించారు. వీటిపై ఆయన స్పందిస్తూ ఆయా సమస్యలకు సంబంధిత అధికారులతో తక్షణమే మాట్లాడుతూ కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.
పార్వతి నగర్ లో స్థానికులు ఎమ్మెల్యే గారిని కలిసి ప్రస్తుతం వాళ్లు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యను వివరిస్తూ, కాలువలు మరియు కరెంటు స్తంభాలు ముంజూరు చేయవలసిందిగా ఎమ్మెల్యే గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. మిగిలిన సమస్యలను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే సూచించారు.
వీటితోపాటుగా 5 కుటుంబాలకు చెందిన అనారోగ్య పరిస్థితిలను ఎదుర్కొన్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి అందించుటకు వినతి పత్రాలు స్వీకరించారు.




