Parvathipuram: దేవతల రామారావు సేవలు అభినందనీయం - ఎమ్మెల్యే!

Parvathipuram: సీతానగరం జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు దేవతల రామారావు పదవీ విరమణ. రామారావు దంపతులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 30 Sept 2026 11:10 AM IST
Parvathipuram
X

Parvathipuram: దేవతల రామారావు సేవలు అభినందనీయం - ఎమ్మెల్యే!

Parvathipuram: సాంఘికశాస్త్ర పాఠశాల సహాయకులు దేవతల రామారావు సేవలు అభినందనీయమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కొనియాడారు. సీతానగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘికశాస్త్ర పాఠశాల సహాయకులుగా విధులు నిర్వర్తిస్తున్న దేవతల రామారావు ఉద్యోగ విరమణ అయిన సందర్భంగా జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఇల్లా ప్రసన్నలక్ష్మి అధ్యక్షతన సన్మాన సభ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొన్నారు. ముందుగా రామారావు దంపతులకు సాలువ కప్పి, పుష్పగుచ్చాలు అందించి ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విధి నిర్వహణలో రామారావు అంకితభావంతో పనిచేస్తూ పలువురి మన్ననలు పొందారన్నారు.

మంచి స్వభావం, నేర్పరితనం, సేవాగుణం కలిగి ఉన్న వ్యక్తి రామారావు అని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉ పాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, రామారావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)