Garividi: గరివిడిలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభ

Garividi: విజయనగరం జిల్లా గరివిడిలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయ సంకేత సభ.

T Sridhar, Staff Reporter -Vijayanagaram
Published on: 19 Jun 2026 9:38 PM IST
Garividi
X

Garividi: గరివిడిలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభ

Garividi: గత ఐదేళ్ల నరకాసుర, తుగ్లక్ పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విముక్తి లభించి, ప్రజా రంజక కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా చీపురుపల్లి నియోజకవర్గంలో విజయోత్సవ సంబరాలు మిన్నంటాయి. స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ కిమిడి కళావెంకటరావు గారి నాయకత్వంలో గరివిడి మండల కేంద్రంలోని KAR కల్యాణ మండపంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయ సంకేత సభ అత్యంత వైభవంగా జరిగింది.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, యువనాయకులు శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారి సారధ్యంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు గరివిడిలోని KAR కల్యాణ మండపంలో ఈ విజయోత్సవ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులతో సభా ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది.

* సభలో స్థానిక ఎమ్మెల్యే,మాజీ మంత్రి శ్రీ కిమిడి కళావెంకటరావు గారు తనదైన శైలిలో గర్జిస్తూ...రాష్ట్ర చరిత్రలోనే 2024 సార్వత్రిక ఎన్నికల తీర్పు ఒక సువర్ణాక్షరాల ఘట్టం. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తూ, దాడులు, దౌర్జన్యాలతో వ్యవస్థలను నాశనం చేసిన వారికి ప్రజలు ఎలాంటి బుద్ధి చెబుతారో గత ఎన్నికలు నిరూపించాయి. నాడు నరకాసుర పాలనతో కుదేలైన రాష్ట్రాన్ని చూసి ప్రజలు విసిగిపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కూటమి నాయకత్వంపై ఉంచిన నమ్మకానికి ఈ రెండేళ్ల పాలనే నిదర్శనం అని స్పష్టం చేశారు.

గత పాలకుల నిర్వాకం వల్ల రాష్ట్రంపై రూ. 10 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోపారు. ఉద్యోగులకు జీతాలు, వృద్ధులకు పెన్షన్లు కూడా ఇవ్వలేని దారుణమైన పరిస్థితిని సృష్టించారు. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో, దార్శనికతతో రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతి పథంలోకి తీసుకువచ్చారు. రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ, ఇచ్చిన మాట ప్రకారం ఒకటో తేదీనే నిరుపేదలకు, వృద్ధులకు దేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవప్రదమైన పింఛన్లను అందిస్తున్నారు. పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను మళ్లీ తెరిపించి కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి అని నిరూపించుకుంది అని కిమిడి కళావెంకటరావు గారు పేర్కొన్నారు.

ఉత్తరాంధ్రకు మురుస్తున్న పెట్టుబడులపై ప్రత్యేకంగా మాట్లాడుతూ..

గత 2014 టీడీపీ హయాంలో చంద్రబాబు గారు కియా లాంటి అంతర్జాతీయ పరిశ్రమను తీసుకొచ్చి అనంతపురం లాంటి వెనుకబడిన ప్రాంతంలో 50 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. కానీ ఆ తర్వాత వచ్చిన దుర్మార్గపు ప్రభుత్వం ఉన్న పరిశ్రమలను కూడా వెళ్లగొట్టి యువత భవిష్యత్తును అంధకారం చేసింది. ఇప్పుడు మళ్లీ 'సీబీఎన్' అనే గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ చూసి దేశ విదేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చే విధంగా ఈ రెండేళ్లలోనే విప్లవాత్మక మార్పులు వచ్చాయి అన్నారు.

ఉత్తరాంధ్రకు వరప్రసాదమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram Airport) పనులు శరవేగంగా సాగుతుండటంతో పాటు, శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్ట్ (Mulapeta Port) పనుల ద్వారా ఉత్తరాంధ్ర తీర ప్రాంతానికి సరికొత్త పారిశ్రామిక కళ వచ్చింది. యువనేత,విద్యా, ఐటి శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారి కృషితో విశాఖను గ్లోబల్ ఐటీ హబ్‌గా మార్చేలా ప్రతిష్టాత్మక అదానీ డేటా సెంటర్ (Adani Data Center) ప్రాజెక్ట్ వేగవంతం కావడం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys) లాంటి ఐటీ దిగ్గజాలు తమ కార్యకలాపాలను విస్తరిస్తుండటం మన కూటమి ప్రభుత్వ ఘనత.

అంతేకాకుండా, టెక్నాలజీ రంగంలో ప్రపంచ నంబర్ వన్ సంస్థ అయిన గూగుల్ (Google) కూటమి ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం, అనకాపల్లిలో ప్రపంచ స్థాయి స్టీల్ దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ (ArcelorMittal) భారీ పెట్టుబడులతో ముందుకు రావడం ఉత్తరాంధ్ర పారిశ్రామిక ప్రగతికి దక్కిన అరుదైన గౌరవం. రాబోయే రోజుల్లో మన చీపురుపల్లి నియోజకవర్గ యువతకు కూడా ఈ ప్రాజెక్టుల ద్వారా స్థానికంగానే పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాం అని భరోసా ఇచ్చారు.

* అనంతరం యువనాయకులు శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారు మాట్లాడుతూ..

పెద్దలు కళావెంకటరావు గారి మార్గదర్శకత్వంలో చీపురుపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమన్నారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రతి ఇంటికీ చేరుస్తామని, నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు అహర్నిశలు శ్రమిస్తామని పేర్కొన్నారు. ఈ విజయానికి కారకులైన కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.

ఈ విజయోత్సవ సభలో చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండలాలకు చెందిన తెలుగుదేశం, జనసేన, BJP కూటమి పార్టీల ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు,వేలాది మంది కార్యకర్తలు పాల్గొని సభను దిగ్విజయం చేశారు.

T Sridhar, Staff Reporter -Vijayanagaram

T Sridhar, Staff Reporter -Vijayanagaram

మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story