Garividi: గరివిడి మండలంలో రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే!

Garividi: విజయనగరం జిల్లా గరివిడి మండలంలో కోటీ ముప్పై ఆరు లక్షలతో చేపట్టనున్న ఇప్పలవలస రెగటి రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు శంకుస్థాపన చేశారు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Published on: 1 Oct 2026 7:50 AM IST
Garividi
X

Garividi: గరివిడి మండలంలో రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే!

Garividi: గరివిడి మండలంలోని ఇప్పలవలస గ్రామ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. ఇప్పలవలస జి.జి రోడ్డు నుంచి రెగటి మీదుగా ఇప్పలవలస వరకు రూ. 136 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు చీపురుపల్లి ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారు నేడు (సెప్టెంబర్ 30) శంకుస్థాపన చేశారు.

ఈ రహదారి పూర్తయితే ఇప్పలవలస, రెగటి పరిసర గ్రామాల ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులు, రైతులు, వ్యాపారులకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY