Alugubilli: ఆలుగుబిల్లిలో ఘనంగా పాసుపుస్తకాల పంపిణీ

Alugubilli: ఆలుగుబిల్లిలో పండుగ వాతావరణం. 765 మంది రైతులు, లబ్ధిదారులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన ఎస్.కోట శాసనసభ్యులు శ్రీమతి కోళ్ల లలితకుమారి.

K MUTHYALUNAIDU, SRUNGAVARAPUKOTA
Published on: 4 Jun 2026 5:55 PM IST
Alugubilli
X

Alugubilli: ఆలుగుబిల్లిలో ఘనంగా పాసుపుస్తకాల పంపిణీ

అలుగుబిల్లి: 765 మంది లబ్ధిదారులకు అందజేసిన ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఎస్.కోట, జూన్ 04: ఎస్.కోట మండలం ఆలుగుబిల్లి గ్రామంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు శ్రీమతి కోళ్ల లలితకుమారి ముఖ్య అతిథిగా విచ్చేసి, గ్రామానికి చెందిన 765 మంది అర్హులైన లబ్ధిదారులకు తమ చేతుల మీదుగా కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భూ హక్కుల పత్రాలు చేతికి అందడంతో లబ్ధిదారులు, రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలుతెలిపారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

K MUTHYALUNAIDU, SRUNGAVARAPUKOTA

K MUTHYALUNAIDU, SRUNGAVARAPUKOTA

Next Story