Kothavalasa: స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర పాల్గొన్న ఎమ్మెల్యే!
Kothavalasa: నూకాలమ్మ ఆలయ పరిసరాల్లో 'స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర' పారిశుధ్య కార్యక్రమం. ప్రజలంతా భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పిలుపు.
Kothavalasa: స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర పాల్గొన్న ఎమ్మెల్యే!
Kothavalasa: స్థానిక సబ్బవరం రోడ్డులోని నూకాలమ్మ అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతంలో 'స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర' కార్యక్రమం శనివారం అత్యంత ఉత్సాహంగా జరిగింది. పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే ఆరోగ్యకరమైన సమాజ స్థాపన సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర'లక్ష్య సాధనలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.
Next Story




