Parvathipuram: సీతంపేట ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

Parvathipuram: సీతంపేట ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచన.

KAILASH SAHU, PALAKONDA
Published on: 23 Aug 2026 8:17 AM IST
Parvathipuram
X

Parvathipuram: సీతంపేట ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

Parvathipuram: సీతంపేట ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ స్పష్టం చేశారు. ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగుల వద్దకు వెళ్లి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రోగులకు అందజేస్తున్న భోజనాన్ని పరిశీలించారు.

ఆసుపత్రికి అవసరమైన మౌలిక వసతులు, వైద్య పరికరాలు ఇతర సౌకర్యాలపై సంబంధిత అధికారులతో చర్చించి, అవసరమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ముదావత్ మల్లికార్జున్ నాయక్ను పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావుతో కలిసి గిరిజన ప్రాంతాలలో ఐటిడిఏ ద్వారా చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆరఎంవో డాక్టర్ డి.వి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story