Komarada: కొమరాడ పీజీఆర్ఎస్‌లో విప్ తోయక జగదీశ్వరి, కలెక్టర్ సమీక్ష
Komarada: కొమరాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ (PGRS) కార్యక్రమంలో ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు.
Komarada: కొమరాడ పీజీఆర్ఎస్‌లో విప్ తోయక జగదీశ్వరి, కలెక్టర్ సమీక్ష
కొమరాడ: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన పీజీఆర్ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ) కార్యక్రమంలో ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే శ్రీమతి తోయక జగదీశ్వరి పాల్గొన్నారు.
మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించి, సంబంధిత అధికారులకు పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజాదర్బార్, పీజీఆర్ఎస్ కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరువ కావడం, ప్రతి సమస్యపై వెంటనే స్పందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.




