Gummalaxmipuram: గుమ్మలక్ష్మీపురం ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం ఎమ్మెల్యే జగదీశ్వరి
Gummalaxmipuram: ప్రజా దర్బార్‌లో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి. సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ.
Gummalaxmipuram: గుమ్మలక్ష్మీపురం ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం ఎమ్మెల్యే జగదీశ్వరి
గుమ్మలక్ష్మీపురం: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు.
శుక్రవారం గుమ్మలక్ష్మీపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రతి వినతిని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే, సంబంధిత శాఖల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి సమస్యలను నేరుగా తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సేవే ధ్యేయంగా పనిచేస్తున్నామని, ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్‌పర్సన్ కడ్రక కళావతి, రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ అక్కేన మధుసూదన్ రావు, రాష్ట్ర నాటక రంగ అకాడమీ డైరెక్టర్ అంబటి రాంబాబు, గుమ్మలక్ష్మీపురం టీడీపీ మండల అధ్యక్షుడు అడ్డాకుల నరేష్, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.




