Pothanapalli: ఎస్.కోటలో భక్తి పారవశ్యం: ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు!

Pothanapalli: ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఆధ్వర్యంలో భగవాన్ రామదూత స్వామి ఆశీస్సులతో శ్రీ వేణుదత్త సువర్ణ లక్ష్మి దాంపత్యవ్రతం ఘనంగా జరిగింది.

K MUTHYALUNAIDU, SRUNGAVARAPUKOTA
Published on: 13 July 2026 2:35 AM IST
Pothanapalli
X

Pothanapalli: ఎస్.కోటలో భక్తి పారవశ్యం: ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు!

Pothanapalli: విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం పోతనాపల్లి గ్రామ పరిధిలోని మానస కన్వెన్షన్స్‌లో ఆదివారం "శ్రీ వేణుదత్త సువర్ణ లక్ష్మి దాంపత్యవ్రతము, కలశ పూజ మరియు కంకణధారణ మహోత్సవం" లోకకల్యాణార్థం అత్యంత వైభవంగా జరిగింది. భగవాన్ శ్రీశ్రీశ్రీ రామదూత స్వామి వారి దివ్య ఆశీస్సులతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రముఖులు రఘు రాజు గారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, ఘనంగా ఏర్పాటు చేశారు.

ఆదివారం ఉదయం 8:30 గంటలకే ప్రారంభమైన ఈ దివ్య పూజా మహోత్సవానికి నియోజకవర్గం నలుమూలల నుండి భక్తులు, దంపతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. లోక కల్యాణంతో పాటు దంపతుల మధ్య దాంపత్య, ఆరోగ్య సమస్యలు తొలగాలని, వృత్తి, వ్యాపార, వ్యవసాయ, ఆర్థిక రంగాల్లో దినదినాభివృద్ధి కలగాలని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే పిల్లల విద్యా, వివాహ, ఉద్యోగ, విదేశీ యాన సమస్యలు పూర్తిగా తొలగిపోవాలని స్వామివారిని వేడుకున్నారు.ఈ పూజలో పాల్గొన్న మహిళా భక్తులందరికీ కుంకుమ పూజకు సంబంధించిన ప్రత్యేక పూజా కిట్లను పూర్తిగా ఉచితంగా పంపిణీ చేశారు.

పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తయిన అనంతరం, విచ్చేసిన భక్తులందరికీ రఘు రాజు గారి ఆధ్వర్యంలో భారీగా అన్నప్రసాద వితరణ (సంతర్పణ) ఏర్పాటు చేశారు. భక్తులు క్రమశిక్షణతో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

ఈ ఆధ్యాత్మిక మహోత్సవం పోతనాపల్లి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భక్తిభావాన్ని నింపింది. ఇంతటి భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రఘురాజు గారికి భక్తులు అందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

K MUTHYALUNAIDU, SRUNGAVARAPUKOTA

K MUTHYALUNAIDU, SRUNGAVARAPUKOTA

Next Story