Palakonda: పాలకొండలో టెన్షన్: ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ గృహ నిర్బంధం!

Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో మెగా డీఎస్సీ అక్రమాలపై వైఎస్‌ఆర్‌సీపీ చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 10 Aug 2026 5:43 PM IST
Palakonda
X

Palakonda: పాలకొండలో టెన్షన్: ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ గృహ నిర్బంధం!

పాలకొండ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ తలపెట్టిన నిరసన ర్యాలీలో పాల్గొనకుండా ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ను ఆయన ఇంటివద్ద పోలీసులు అడ్డగించారు.

నిరసన ర్యాలీకి పర్మిషన్ లేదని ర్యాలీని ఆపివేయాలని ఆయనకు పాలకొండ సీఐ ప్రసాదరావు ఆయనను కోరారు. దీనితో ఎమ్మెల్సీ విక్రాంత్ కు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది ర్యాలీలో పాల్గొనకుండా పాలకొండ పోలీసులు అరెస్ట్ చేసిన తమ పార్టీ స్థానిక నాయకులను విడుదల చెయ్యాలని కోరడంతో పోలీసులు సానుకూలంగా స్పందించి వారిని విడుదల చేసారు.

అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారని డిఎస్సీ జరిగిన అక్రమాలపై జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రశ్నిస్తామని ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేసి జరిగిన అక్రమాలను బైటపెట్టేదాకా వైసీపీ పోరాటం చేస్తుందని అన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story