Palakonda: పాలకొండలో రోడ్లపైకి పశువులను వదిలితే బందిల దొడ్డికే కమిషనర్

Palakonda:విజయనగరం/పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణంలో రోడ్లు, మార్కెట్‌లలోకి పశువులను వదిలితే కఠిన చర్యలు ఉంటాయని,

KAILASH SAHU, PALAKONDA
Published on: 27 Jun 2026 5:22 PM IST
Palakonda
X

Palakonda: పాలకొండలో రోడ్లపైకి పశువులను వదిలితే బందిల దొడ్డికే కమిషనర్

పాలకొండ: పాలకొండ పట్టణములో పశువులను రోడ్లపైకి, మార్కెట్ లోకి వదలకూడదని కమీషనర్ శ్రీ పి.వి.నూకరాజు ఒక ప్రకటన చేశారు.

పశువులను రోడ్లపైకి వదలడం వలన ట్రాఫిక్ సమస్యలు, రోడ్లు అపరిశుభ్రం మొదలగు సమస్యలు తలెత్తుతున్నాయని, మార్కెట్ లలోకి వదిలివేయడమువలన పబ్లిక్ కు, చిన్నపిల్లలకు అంతరాయం కలుగుతున్నాయని, పశువుల పేడ వలన మార్కెట్ అంతా అపరిశుభ్రంగా తయారవడం వలన శానిటేషన్ కు ఇబ్బంది కలుగుతుందని.

అలాగే రోడ్లు కూడా అపరిశుభ్రంగా తయారవుతున్నాయన్నారు. వాహనాలమీద వెల్లేవారిని కూడా ఆవులు పొడుస్తున్నాయి.

మరియు ట్రాఫిక్ సమస్యలు కలుగుతున్నాయన్నారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పశువులను సంరక్షించుకునే భాద్యత యజమానులదే అన్నారు. కనుక రోడ్లపైకి, మార్కెట్ లలోను బహిరంగంగా పశువులు కనిపిస్తే గొల్లవీధివద్ద ఉన్న బందిర దొడ్డికి తరలిస్తామన్నారు.

చలానా కట్టి పశువులను విడిపించుకోవాల్సి ఉంటుందని కనుక పశువులను రోడ్లపైకి మార్కెట్లలోకి వదలకుండా మీ స్వంత స్థలములో సంరక్షించుకోవలసినదిగా పశువుల యజమానులకు విజ్ఞప్తి చేశారు

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story