Vizianagaram: గుర్ల జూనియర్ కళాశాలలో నశా ముక్త్ భారత్ సదస్సు!
Vizianagaram: విజయనగరం జిల్లా గుర్ల జూనియర్ కళాశాలలో నశా ముక్త్ భారత్ సదస్సు నిర్వహించి, విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.
Vizianagaram: గుర్ల జూనియర్ కళాశాలలో నశా ముక్త్ భారత్ సదస్సు!
గుర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో "నశా ముక్త్ భారత్ అభియాన్" అవగాహన కార్యక్రమం నిర్వహణ
గుర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేడు "నశా ముక్త్ భారత్ అభియాన్" అవగాహన కార్యక్రమాన్ని గుర్ల ఎస్.ఐ. గారి సహకారంతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు, మద్యం, పొగాకు వంటి వ్యసనాల వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాల గురించి వివరంగా అవగాహన కల్పించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.
అదేవిధంగా, జిల్లా ఎస్పీ కార్యాలయం చేపట్టిన "మీతో మీ ఎస్పీ" కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉన్న పోలీసు సేవలు, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను సంప్రదించే విధానంపై కూడా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి సంస్థ సభ్యులు, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




